![]() |
![]() |
.webp)
బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అల్లరి చేస్తుంది. ఆటలు ఆడిస్తుంది. హోస్టింగ్ ని మంచి జోష్ తో చేస్తుంది. ఆడియన్స్ ని ఎక్కడా బోర్ కొట్టించకుండా కామెడీ కంటెంట్ తో కనెక్ట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు అని చూడదు ఎవరితోనైనా కామెడీ చేస్తుంది. డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంత బాగా చేస్తుంది.
ప్రెజంట్ జనరేషన్ లో బుల్లితెర మీద వన్ అండ్ ఓన్లీ ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది యాంకర్ శ్రీముఖి. అలాంటి శ్రీముఖి ఇప్పుడు తన తమ్ముడు సుశృత్ బర్త్ డే వేడుకను చాలా గ్రాండ్ గా చేసింది. "అందరికంటే నాకు నువ్వుంటేనే ఇష్టం...హ్యాపీ బర్త్ డే .. ఐ లవ్ యు సుశృత్" అంటూ తన తమ్ముడికి ముద్దుపెడుతూ ఉన్న బర్త్ డే ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక శ్రీముఖి ఫాన్స్, నెటిజన్స్, బుల్లితెర నటీనటులు అంతా సుశృత్ కి విషెస్ చెప్పారు. సింగర్, యాక్టర్ సాయికిరణ్, జబర్దస్త్ కమెడియన్ అవినాష్ "హ్యాపీ బర్త్ డే" అని కామెంట్ చేశారు.
సింగర్ సిద్ శ్రీరామ్ "హ్యాపీ బర్త్ డే రా బామ్మర్ది" అని విష్ చేసాడు. శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 లో అడుగుపెట్టి రన్నర్ గా నిలిచింది. "నేను శైలజ, జులాయి" వంటి మూవీస్ లో శ్రీముఖి నటించింది. సిల్వర్ స్క్రీన్ మీద కంటే స్మాల్ స్క్రీన్ మీద ఆమె పేరు మోత మోగిపోతూ ఉంటుంది. రీసెంట్ గా ఆమె మీద వచ్చినపెళ్లి రూమర్స్ ని ఖండించింది శ్రీముఖి..
![]() |
![]() |